2017/11/05

ఈతరం ఇల్లాలు

ఓపెన్ సీన్: 

అదొక పెళ్లి చూపులకి రెడీ అవుతున్న అమ్మాయి


సీన్ 1:

పెళ్లి చూపులకి రెడీ అవుతున్న ఒక అమ్మాయి(శ్రీ దేవి) చుట్టూ వాళ్ల అమ్మ, పిన్ని, ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అమ్మాయి అంటుంది అమ్మతో నాకు ఎందుకు పెళ్లి... ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు... నేను నో చెప్పేస్తా....శ్రీ వాళ్ల అమ్మ అంటుంది ఈ సారి కానీ అలా చేశావంటే చంపి పడెస్తా....లేదా మేము చస్తాం....అమ్మాయి మొహం చిన్నగా అయ్యీపోింది...ఇష్టం లేకుండానే వెళ్ళి పెళ్లి చూపులలో కూర్చుంది....అబ్బాయిని ఏమైన అడగామన్నారు చుట్టూ ఉన్నవాళ్ళు...అబ్బాయి సిగ్గుతో నవ్వుతూ ఏమీ అడగాలి అని ఒక టైప్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు.......

ఏదో ఒకటి అడుగు అని ఆ అబ్బాయితో పాటుగా వచ్చిన ఫ్రెండ్ అండ్ ఆ అబ్బాయి అక్కా అన్నారు.... అబ్బాయి మీకు వంట వచ్ఛండి అని అడిగాడు..వెంటనే అబ్బాయి ఫ్రెండ్ నెక్స్ట్ పాట పాడటం వచ్చునా అని అడుగుతవా అని వెటకారం గా అంటాడు.... అందరు టక్కున నవ్వేస్తారు....దానికి అబ్బాయి సిగ్గుతో తల దించుకుంటాడు... అందరు నవ్వుతూంటారు కానీ అమ్మాయి మాత్రం నవ్వదు....అది గమనించిన అబ్బాయి(శ్రీనివాస్) తల్లి అమ్మాయి మొహం లో ఏమీ ఎక్స్‌ప్రెషన్ లేదు...అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదా ఏమిటి అని అడుగుతుంది... దానికి శ్రీ తల్లి అదేం లేదండీ కొంచెం కంగారు పడుతుంది.
పెళ్లి అంటే ఆ మాత్రం భయం ఉంటుంది కదా.... మనం ఆ స్టేజ్ దాటి వచ్చిన వాళ్ళమే కదా.....మీకు తెలియన్ది ఏముంది అని అంటుంది......అమ్మాయి తరపు వాళ్ళు అడుగుతారు అబ్బాయి ని .... ఏమీ బాబు మా అమ్మాయి నచ్చిందా లేదా అని.. పక్కనే ఉన్న మరో అతను మన అమ్మాయి నచ్చకుండా ఎవరికైన ఉంటుందా అని అంటాడు......వెంటనే అబ్బాయి వల్ల అమ్మ అంటుంది....ఆ విషాయానికి వస్తే మా వాడికి మాత్రం ఏమీ తక్కువ...హైట్ వేట్ జాబ్ పర్సన్యాలిటీ అన్ని ఉన్నాయి గా అంటుంది....అంతా కామ్గా ఉంటారు....మా నిర్ణయం ఇంటికి వెళ్ళిన తరవాత కాల్ చేసి చెప్పుటాం అని అక్కడ నుంచి వెళ్ళిపోతారు....వెంటనే అమ్మాయి చికాకుగా జడ పువ్వులు అన్ని కూడా తీసి పక్కకి విసిరేస్తుంది...

నాకు అబ్బాయి నచ్చలేదు... ఈ పెళ్లి కూడా వద్దు అని చెప్పుతుంది.. దానికి వాళ్ల అమ్మ పిన్ని నాన్న అందరు అంటారు... అబ్బాయి బాగున్నాడు కదా..నువ్వు కావాలి అని పెళ్లి క్యాన్సల్ చెయ్యాలి అని చూడకు...ప్లీస్ ఒప్పుకోవే... ఫ్యామిలీ కూడా చాలా మంచి ఫ్యామిలీ... అబ్బాయి గురించి ఆల్‌రెడీ బాగా చెప్పారు కూడా మనకు తెలిసిన వాళ్ళు.....ప్లీస్ బంగారం  ఒప్పుకోవచ్చు

అమ్మాయి వాళ్ల అమ్మ అబ్బాయి వాళ్ల ఇంటికి కాల్ చేసి చెప్పేస్తుంది...మా అమ్మాయి కి మీ అబ్బాయి నచ్చదు... మీ అబ్బాయి కి మా అమ్మాయి నచ్చింది అని చెప్పేస్తే...మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం ఏమంటారు అంటుంది....దానికి బదులుగా శ్రీనివాస్ వాళ్ల అమ్మ ఓకే అని అంటుంది... శ్రీనివాస్ ని అడుగుతుంది వాళ్ల అమ్మ.... ఏరా అమ్మాయి బాగుంది కదా.. నువ్వు కూడా ఆ అమ్మాయికి నచ్చవు అని  చెప్పింది.. వెంటనే శ్రీనివాస్ కూడా మీ ఇష్టం అమ్మ.. నాకు ఓకే అంటాడు... ఇంకెముంది రెండు కుటుంబాలు కలిసి మాట్లాడుకుంటారు... ఎంగేజ్మెంట్ వచ్చే నెలలో పెట్టుకుందాం...పెళ్లి ఇంకో ౩ నెలల్లో పెట్టుకుందాం అని డిసైడ్ అయ్యీ వెళ్ళిపోతారు....

సీన్ 2:

శ్రీనివాస్కి ఎంగేజ్మెంట్ కి ముందే ఆ అమ్మాయితో మాట్లాడాలి అనిపిస్తుంది...కానీ ఎంగేజ్మెంట్ తరవాత నెమ్మదిగా నంబర్ ట్రై చేద్దాంలే అనుకుంటాడు...అనుకునే లోపే...ఎంగేజ్మెంట్ టైమ్ వచ్చేసింది...శ్రీనివాస్ తన ఎంగేజ్మెంట్ డ్రెస్ కోసం ప్రతి రోజు షాపింగ్ చేసేవాడు... తనతో పాటు తన ఫ్రెండ్ ని కూడా వెంట తీసుకొని వెళ్ళేవాడు....వాళ్ల ఫ్రెండ్ బాబు నీకు ఒక నమస్కారం నీ షాపింగ్ నువ్వు చేసుకో నన్ను వదిలెయ్ అంటాడు..... దానికి శ్రీనివాస్ ఒరేయ్ ప్లీస్రా నా లైఫ్ లో రెండే రెండు సార్లు నిన్ను విసిగిస్తా నువ్వు నన్ను ఏమీ అనుకోకూడదు.. ఒకటి నా ఎంగేజ్మెంట్కి రెండు నా పెళ్లి షాపింగ్కి........వెంటనే వాళ్ల ఫ్రెండ్ నాకు తప్పదు కదా అంటాడు......

శ్రీనివాస్ వాళ్ల ఫ్రెండ్తో అంటాడు...ఒరేయ్ షణ్ముఖ తనకి ఈ కలర్ షర్ట్ నచ్చుతుంది అంటావా...ఏమోరా నాకు ఏమీ తెలుసు...అంటాడు..అదిగో కోపం తెచ్చుకోను అన్నావు అంటాడు శ్రీనివాస్....సారీరా బాబు క్షమించు....ఈ కలర్ బాగానే ఉంది లే తీసుకో అంటాడు... దానికి శ్రీనివాస్ ఒక సారి ఆ అమ్మాయి ఏ కలర్ చీర కడుతుందో తెలుసుకుంటే బాగుండేది...నేను కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేటట్లు తీసుకుంట అంటాడు...దానికి షణ్ముఖ వెంటనే ఒరేయ్ ఆ అమ్మాయి కన్న అమ్మ కూడా ఇన్ని సార్లు తలచుకొని ఉండదురా....అయినా ఎందుకు అంత కంగారు...ఏ సారి కి ఏదో అలా కానించెయ్ ఏదో ఒక డ్రెస్ తో... పెళ్లికి ముందు ఎలాగూ మాటలు చాటింగ్ ఉంటాయిగా.... అప్పుడు డిసైడ్ అవ్వొచు లే.. పెళ్లికి మ్యాచింగ్ డ్రెస్ మ్యాచింగ్ షూస్ మ్యాచింగ్ హైర్ స్టైల్...అన్ని అన్ని కూడా....మీ ఇష్టం వచ్చినట్టే చెద్దురు…..

మరుసటి రోజు ఎంగేజ్మెంట్ అనగా ముందు రోజు రాత్రి...శ్రీనివాస్కి నిద్ర పట్టడం లేదు..అక్కడ శ్రీ పరిస్థితి కూడా అలానే ఉంది....శ్రీనివాస్కి డోర్ కొడుతునట్టు సౌండ్ వస్తుంది....శ్రీనివాస్ లేచి డోర్ తీసిచూస్తే ఎదురుగా వాళ్ల  అమ్మ  ఉంది..శ్రీనివాస్ నిద్ర మత్తులో ఏమిటమ్మ ఈ టైమ్ లో అని ఆవలిస్తూ చికాకుగా అంటాడు...దానికి వాళ్ల అమ్మ  ఏమిట్రా తెల్లారి గంట అవుతుంది...ఇప్పుడు రెడీ అవ్వకపోతే నీ ఎంగేజ్మెంట్కి నువ్వు లేకుండా ఎలా చేస్తారు....రెడీ అవ్వు అని అంటుంది... మరో పక్క శ్రీ పరిస్థితి కూడా అంతే….శ్రీ వాళ్ల అమ్మ అంటుంది... నువ్వు ఇలాగే బద్ధకంగా ఉంటే....రేపు పొద్దున నీ మొగుడు చేతిలో దెబ్బలు తింటవ్......

ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చేసింది...అందరు హడావిడిగా ఉన్నారు... శ్రీనివాస్ ముసి ముసి నవ్వులుతో అందరినీ పలకరిస్తూ శ్రీ వైపు చూస్తున్నాడు....కానీ ఆమె నుంచి ఎటువంటి రెస్పాన్స్ రవకాపోయేసరికి కొంచెం మొహం చిన్నగా అయ్యీపోింది....ప్రధాన ఘట్టం రానే వచ్చేసింది....శ్రీ & శ్రీనివాస్ ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు....శ్రీ మొహంలో నవ్వు లేకాపోయేసరికి శ్రీనివాస్ కూడా హ్యాపీగా ఉండలేకపోయాడు....మనసులో అనేకమైన అనుమానాలు శ్రీనివాస్ కి...ఈ అమ్మాయికి అస్సలు పెళ్లి ఇష్టం ఉందా లేదా...లేక వేరే ఎవరినైనా లవ్ చేస్తూ ఇంట్లో వాళ్ల బలవంతం మీద చేసుకుంటుందా అని మొహం అయోమయంగా పెట్టి..దీర్గ ఆలోచనలో పడ్డాడు....ఇంతలో షణ్ముక్ వచ్చి ఏరా శ్రీని నంబర్ అడిగవా లేదా....లేకపోతే చెప్పు నేను అడిగి నీకు ఇస్తాను అంటాడు....ఏమోరా తనకి ఈ పెళ్లి ఇష్టం లేదేమో అనిపిస్తుంది....చూడు ఆ మొహం లో అస్సలు నవ్వే లేదు అంటాడు శ్రీనివాస్....వెంటనే షణ్ముక్ ఒరే అమ్మాయిలకి చాలా ఆలోచనలు ఉంటాయి పెళ్లి అంటే నువ్వు అర్ధం చేసుకోవాలి....

సీన్ 3:
ఎంగేజ్మెంట్ తంతు కూడా అయ్యీపోింది కానీ....శ్రీకి & శ్రీనివస్కీ   ఏదో జరిగిపోంది అనిపించింది.....నంబర్స్ కూడా తీసుకోలేదు....కొన్ని రోజుల తరవాత శ్రీనివాస్ శ్రీ ఫేస్‌బుక్ అకౌంట్కి రిక్వెస్ట్ పంపించాడు...డేలీ చెక్ చేస్తూ ఉండేవాడు....ఆమె మాత్రం రిక్వెస్ట్ ఆక్సెప్ట్ చేసేది కాదు...కొంచెం అనుమానం ఎక్కువ అయ్యింది శ్రీనివాస్కి.....

శ్రీనివాస్ని ఆఫీస్లో మరియు ఫ్రెండ్స్ కూడా మ్యారేజ్ పార్టీ అని అడిగారు....నెక్స్ట్ రోజు శ్రీనివాస్ ఆఫీస్ కాలీగ్స్తో రెస్టోరెంట్కి వెళ్లాడు...కాలీగ్స్లోఒకతను శ్రీనివాస్ ఏమిటి కళ్ళు రెడ్గా ఉన్నాయి...అస్సలు నిద్ర ఉండటం లేదా..  పార్ట్ టైమ్గా కాల్ సెంటర్ జాబ్ చేస్తున్నావని నైట్ టైమ్ అని మాకు సమాచారం అందింది అని అనగానే...అందరూ పక్కున నవ్వెశారు...కాలీగ్స్లో ఒక అమ్మాయి శ్రీనివాస్ని అడుగుతుంది...ఏమిటి శ్రీనివాస్ ఎంత వరకు వచ్చింది మీ రొమ్యాన్స్...ఫుల్ టైమ్ చాటింగ్ అనుకుంట...అన్ని పెళ్ళికి ముందే కానించేయకండి కొంచెం పెళ్లి తరవాత కూడా ఉంచుకోండి....లేకపోతే పెళ్లి తరవాత మాట్లాడుకోవడానికి ఏమీ ఉండవు.......శ్రీనివాస్ నవ్వుతూ అంత లేదు మాధురి అని నవ్వేస్తాడు...

శ్రీనివాస్ ఇంటికి వచ్చేసిన తరవాత మంచం పైన కూర్చొని ఆలోచనలో పడతాడు....ఏమిటి ఈ అమ్మాయి అస్సలు రెస్పాన్స్ ఇవ్వదు....బయట ఒక్కొక్కరూ పార్క్స్ మూవీస్ అని పెళ్లికి ముందే హనిమూన్ పీరియడ్ ఎంజాయ్ చేస్తూ ఉంటే...ఈ అమ్మాయికి మాత్రం ఏమీ పట్టానట్టు ఉంది....అనవసరంగా ఓకే అన్నాన అనుకుంటాడు...మరుసటి రోజు ఫ్రెండ్స్తో సేమ్ డిస్కషన్ వస్తుంది....వాళ్ళు శ్రీనివాస్కి ఇలా చెప్తారు...అమ్మాయిలు ఒక్కొక్కరూ ఒక్కోలా ఉంటారు..కొందరు అంత ఫ్రీగా మాట్లడేయలేదు...యూ డోంట్ వరీ రా అంటారు....శ్రీనివాస్ వాళ్ల అక్కా కూడా సేమ్ అలానే చెప్పుతుంది...శ్రీనివాస్ నెమ్మదిగా ఆలోచనలో పడతాడు...కొంచెం convince అవుతాడు....

మళ్లీ నైట్ పడుకొనే ముందు ఫేస్‌బుక్లో మెసేజ్ పోస్ట్ చేస్తాడు....గుడ్ నైట్ అని.. అలా 4 డేస్ కంటిన్యువస్గా మెసేజ్ పెడతాడు...ఆ రోజు డిసెంబర్ 31 తన ఫర్స్ట్ విషస్ ఆ అమ్మాయికి చెప్పాలి అని డిసైడ్ అయ్యీ....కాల్ చెయ్యాలి అంటే నంబర్ లేదు.. పోనీ చాట్ చెయ్యాలి అంటే అదికూడా లేదు...ఎప్పటిలానే ఫేస్‌బుక్ పోస్ట్ చేశాడు మెసేజ్...మళ్లీ తనకి డౌట్ వస్తుంది..ఇక్కడ నేను ఇంత ఆరాట పడుతున్న కదా తన గురించి...కనీసం ఒక్క సారి కూడా నాతో మాట్లాడాలి లేక ఫేస్‌బుక్ లో ప్రొఫైల్ చెక్ చెయ్యాలి అని ఏమీ అనిపించదా?? ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంది..పొస్త్స్ కూడా బాగానే పెట్టింది...అబ్బాయీలతో కూడా ఫోటోస్ బాగానే ఉన్నాయి.. సో అబ్బాయీలతో మాట్లాడదూ అని కూడా లేదు...అంటే ఫ్రీగా ఉంటాడి అని కూడా తెలుస్తుంది మరి ఏమిటి తాను నా గురించి ఆలోచించడం లేదు?? 


కొన్ని రోజుల నిరీక్షణ తరవాత...ఒక రోజు ఫేస్‌బుక్ రిక్వెస్ట్ ఆక్సెప్ట్ చేసినట్టు వచ్చింది...తరవాత. మన వాడు రెచ్చిపోయి మెసేజస్ చెయ్యడం మొదలుపెట్టాడు.....మెసేజస్ కూడా శ్రీనివాస్ 10 మెసేజస్ పెడితే శ్రీ ఒక మెసేజ్తో రిప్లై ఇచ్చేది..పాపం శ్రీనివాస్ ఆరాటానికి ఆ అమ్మాయి గంటకి ఒక రిప్లై ఇచ్చేది...నేను ఆన్‌లైన్ ఎక్కువ రాను...కొంచెం నెట్ యూసేజ్ తక్కువ ఏమీ అనుకోకు అనేది...ఆన్‌లైన్లోనే ఉండీ కూడా ఎందుకు సరిగా చాట్ చెయ్యదు అని మళ్లీ ఫీల్ అవుతాడు....

అలా కొద్ది రోజులు వాళ్ల చాట్ కంటిన్యూ అయిన తర్వాత...ఒక రోజు వాళ్ళు ఇద్దరూ కలుసుకొనే రోజు వచ్చింది అది ఎలా అంటే...శ్రీనివాస్ పాపం అమ్మాయి వెడ్డింగ్ కార్డ్స్ అవి ప్రింట్ చేయించుకోలేదు అని ఆ అమ్మాయి ఫ్రెండ్స్ కార్డ్స్ కూడా మన వాడి ఖాతాలో వేసుకున్నాడు...ఆ వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడానికి కలుద్దాం అన్నాడు....ఒక పని తప్పింది కదా అని...శ్రీ హ్యాపీ ఫీల్ అయ్యీ...ఓకే అనుకున్న తరవాత ప్లేస్ అండ్ టైమ్ ఫిక్స్ అయ్యారు...చాలా రోజుల తర్వాత మళ్లీ చూడబోతున్న అనే ఫీల్ లో మన వాడు అద్డం ముందుకు వెళ్ళడం చూసుకోవడం..గంటకి ఒక సారి ఫేస్ వాష్ చేసుకోవడం...అబ్బో హడావిడి అంత ఇంత కాదు...

2016/06/14

Telugu sametalu

1. కందకి లేని దురద కత్తి పీటకి ఎందుకని
2. అయిన వాళ్ళకి ఆకుల్లో ....కానీ వాళ్ళకి కంచల్లో
3. ఆడాది తిరిగి చెడుతుంది....మగ వాడు తిరగక చెడుతాడు
4. అందాన్ని అందాలానికి ఎక్కిస్తే అభిమానానికి దూరం అవుతావ్....